ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాలి : ఎమ్మెల్సీ కవిత
vallanki talam | దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళమెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు తరహా వ్యవస్థ నడుస్తోందని, ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందన్న
హైదరాబాద్ : దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళమెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు తరహా వ్యవస్థ నడుస్తోందని, ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందన్న కవులు, కళాకారులు, రచయితలు ఆలోచన చేయాలని కవిత.. ఎమ్మెల్సీ గొరటి వెంకన్న సూచనలు తీసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 36వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం కవిత సందర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’ పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వల్లంకి తాళంపై కవిత అడిగిన ప్రశ్నలకు వెంకన్న సమాధానాలు ఇచ్చారు. నల్లమల అడవిని, ప్రకృతిని, చెంచులు అద్భుతమైన శైలిలో వర్ణించారని కొనియాడారు. ప్రత్యేకంగా నల్లమల అడవులతో తనకు అనుబంధం ఉందని అన్నారు. యురేనియం, వజ్రాల కోసం కేంద్ర ప్రభుత్వం అడవిని తవ్వే ప్రయత్నం చేసిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, మరికొంత మంది అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశామని, మైనింగ్ లీజును రద్దు చేసే వరకు పోరాటం చేశామని వివరించారు.
ఊరుకు గాయమైతే ఊరుకునే సంస్కృతి మనది కాదు

తెలంగాణ ఏర్పాటు తర్వాత యురేనియం తవ్వకాలకు కేంద్రం మళ్లీ వస్తే తవ్వనిచ్చే ప్రశ్నే లేదని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు కవిత గుర్తు చేశారు. అడవికి గాయమైతే చూస్తూ ఊరుకునే సంస్కృతి మనది కాదని తేల్చిచెప్పారన్నారు. వల్లంకి తాళంలోని కవితలను పదేపదే తాను చదివానని చెప్పారు. పుస్తకంలో అనేక పండ్ల గురించి ప్రస్తావనలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాండలికంపై చర్చ జరిగిందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు వివిధ భాషా మాండలికల్లో మాట్లడుతారన్నారు.
అలాంటింది మాండలికాల్లో ఉప మాండలికంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి గోరటి వెంకన్న రాయడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. వెంకన్న రచనా శైలి అద్భుతంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తే 2500 మంది పిల్లలు, విద్యార్థులు కవిత్వం రాశారని, కాబట్టి కవిత్వంపై ఆసక్తి ఉన్నవాళ్లను ప్రోత్సహించడం ఎలా అని వెంకన్నను అడిగి తెలుసుకున్నారు.
గొప్ప కవులున్న వారసత్వం తెలంగాణది
దేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తొలి అవార్డు తెలుగులో తెలంగాణ బిడ్డకు 1955లో సురవరం ప్రతాప రెడ్డికే వచ్చిందని కవిత గుర్తుచేశారు. ఆ పరంపర ఇవాళ గోరటి వెంకన్న వరకు కూడా కొనసాగుతూ వస్తున్నదని చెప్పారు. సురవరంతో పాటు సీ నారాయణ రెడ్డి, దాశరథి, ఎన్ గోపి, చేకూరి రామారావు, అంపశయ్య నవీన్, సామల సదాశివ, కాత్యాయని విధ్మయే, నిఖిలేశ్వర్, గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయన్నారు. ఇలాంటి మహానుభావులు, గొప్ప కవులు ఉన్న వారసత్వం తెలంగాణదని స్పష్టం చేశారు. మన కవులు కేవలం ఈ రోజు చదివి రేపు మరిచిపోయే విధంగా కాకుండా ప్రజల హృదయాల్లో తరతరాలు గుర్తుండిపోయే రచనలు చేశారని తెలిపారు.

తెలుగులోని కమ్మదనాన్ని పరిచయం చేసిన వల్లంకి తాళం
‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో సురవరం ప్రతాప రెడ్డి ఆనాటి సామాజిక పరిస్థితులను విశ్లేషణ చేశారని, కాళోజీ నారాయణ రావు ప్రజల గోసను ‘తన గొడవగా’ చెప్పుకున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. సీ నారాయణ రెడ్డి విశ్వమానవుల గురించి ‘విశ్వంభర’లో వివరించారని, దాశరథి చాలా సంవేదనతో ఈ భూగోళం పుట్టాలంటే ఎన్ని సురగోళాలు కూలిపోయాయో.. ఇప్పటి మానవ రూపం జరగడానికి ఎంత పరిణామం చెందాల్సి వచ్చిందోనని తన బాధను వ్యక్తం చేశారని వివరించారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మూలాల్లోకి వెళ్లి అడవిని, అడవి జీవితాన్ని , చెట్టును, పుట్టను, పక్షిని పరిశీలించి వెంకన్న అద్భుతమైన రచనలు చేశారని పేర్కొన్నారు.
పనిలో నుంచి, శ్రమలో నుంచి వచ్చిన పదాలను మనం కాపాడుకున్నాం కాబట్టే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అంటారని చెప్పారు. తెలంగాణ యాసనే కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన పదాలను వల్లంకి తాళం పుస్తకంలో వెంకన్న వాడారని అన్నారు. తెలుగులోని తేనెదనాన్ని, కమ్మదనాన్ని మరొకసారి పరిచయం చేసినట్టుగా వల్లంకి తాళం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలకు ఉన్న మట్టి తత్వాన్ని ప్రతిబింబించారని కవిత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

