మనసుకు అత్యంత దగ్గరైన పండుగ బతుకమ్మ : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | తన మనసుకు అత్యంత దగ్గరైన పండుగ బతుకమ్మ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని మినీస్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆడబిడ్డలతో
మెట్పల్లి : తన మనసుకు అత్యంత దగ్గరైన పండుగ బతుకమ్మ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని మినీస్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆడబిడ్డలతో కలిసి ఆడిపాడారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆడబిడ్డలందరికీ మన పండుగైన బతుకమ్మను కాపాడుకోవాలనే ఆలోచన ఏర్పడిందన్నారు.
రోజంతా పని చేసిన కష్టాలన్నింటినీ మర్చిపోయి, పుట్టింటికి వెళ్లి అందరితో కలిసి సంతోషంగా ఆడిపాడే పండుగ బతుకమ్మ అని తెలిపారు. చిన్నతనంలో 8 ,9 తరగతి వరకు చదువుకునే రోజుల్లో తమ ఊరికి వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నట్లు తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, పదో తరగతి, ఏడెనమిది తరగతి చదువుకునే పిల్లలు సైతం బతుకమ్మ పాటలు నేర్చుకుని మళ్లీ సంప్రదాయంగా, గర్వంగా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చిందని కవిత అన్నారు.
మన చుట్టుపక్కల దొరికే పువ్వులనే దేవుడిగా కొలిచే పండుగ అని చెప్పారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్సీ కవిత, కానీ వందల ఏండ్ల నుంచి బతుకమ్మ రూపంలో పర్యావరణం గురించి చెప్పకనే చెప్పారన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా చెరువులు నిండుగా ఉన్నయని, ప్రతి చోట బతుకమ్మ కోసం సర్పంచులు, అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అనంతరం వందలాది మంది మహిళలతో కలిసి కవిత ఉత్సాహంగా ఉయ్యాల పాటలు పాడుతూ.. ఆటలాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దావ వసంత, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

