బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జ్ ముందు ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంపీ పర్వేశ్ వర్మ, మంజీందర్‌సింగ్ సిర్సా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసి, ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో తనకున్న మంచి పేరును, ప్రతిష్టను చెడగొట్టడానికి అక్రమ పద్ధతులను వారు ఎంచుకున్నారని ఆమె పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన బీజేపపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ కవిత కోర్టును కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

