MLC Kalwakuntla Kavitha | కవిత అరెస్ట్ చట్ట విరుద్ధం… నిబంధనలు తుంగలో తొక్కిన ఈడీ
MLC Kalwakuntla Kavitha | ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. ఆ సంస్థ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి వ్యతిరేకమని ఆమె లాయర్ సోమా భరత్ అన్నారు.
MLC Kalwakuntla Kavitha | ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం.. ఆ సంస్థ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి వ్యతిరేకమని ఆమె లాయర్ సోమా భరత్ అన్నారు. ఈ మేరకు కవిత అరెస్ట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని అన్నారు. అరెస్ట్ చేయడంలోనూ ఈడీ అధికారులు నిబంధనలు పాటించలేదని అన్నారు. దీంతో పాటు ఒక మహిళను రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం దుర్మార్గమని, అరెస్ట్‌పై న్యాయమూర్తి వారెంట్ తీసుకోకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్ట్‌కు గల కారణాలను తెలియజేయాలని కోరినా ఈడీ అధికారులు ఇవ్వలేదని భరత్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను కూడా అతిక్రమించిన ఈడీ ఈ విధంగా అరెస్ట్ చేయడం అన్యాయం, చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను ఈడీ అరెస్ట్ అంశంపై కోర్టులో విచారణ కొనసాగుతుందని, అదే సమయంలో అరెస్ట్ చేసిందన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చిందని, అయితే సుప్రీంకోర్టు ఈ కేసును ఈ నెల 19కి వాయిదా వేసిందని అన్నారు. అయినప్పటికీ అప్పటి వరకు కూడా వేచి చూడలేని ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

