MLC Kavita | ఎన్నికలప్పుడే వచ్చి మాయ మాటలు చెప్పేవాళ్లను నమ్మొద్దు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavita | కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్‌లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్లి మాటలు నమ్మి ఓట్లేసే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదని ఆమె చెప్పారు.
భోధన్: కాంగ్రెస్, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్‌లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్లి మాటలు నమ్మి ఓట్లేసే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదని ఆమె చెప్పారు. బుధవారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్ పర్యటనలో కవిత మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇప్పుడు బీసీ జనగణన గురించి మాట్లాడుతున్నారని, కానీ సంక్షేమంలో బీసీలకు పెద్దపీట వేసిందే కేసీఆర్ అనే సంగతి గుర్తంచుకోవాలని కవిత హితవుపలికారు.
నిజామాబాద్ జిల్లాలో 2014కు ముందు ఒక్కటే బీసీ హాస్టల్ ఉండేదని, ఇప్పుడు కేసీఆర్ పాలనలో బీసీ హాస్టల్ల సంఖ్య 15కు పెరిగిందని కవిత చెప్పారు. బీసీ బిడ్డలను విదేశాలకు పంపి చదివిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, ఇది బీసీ సాధికారత అవునో కాదో..? రాహుల్‌గాంధీయే చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రైవేటు పరం చేసినప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదో రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ప్రభుత్వం చెరుకు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నదని, రైతులను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకునే నైజం కేసీఆర్‌ది అయితే, ఆ రైతులపై రాజకీయాలు చేసే నైజం రాహుల్‌గాంధీది అని కవిత విమర్శించారు.
ఎన్నికలప్పుడే వచ్చి మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మాలో లేదంటే ఎల్లప్పుడూ వెంట ఉండి పనిచేసే వాళ్లను నమ్మాలో ప్రజలే ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా మత కల్లోలాలు రెచ్చగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఇప్పుడు హిందూ ముస్లింలు కలిసిమెలిసి మత సామరస్యంతో పండుగలు చేసుకుంటున్నారని చెప్పారు. 65 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజలకు మంచి నీళ్లుగానీ, సాగు నీళ్లుగానీ, మంచి విద్యగానీ, మంచి వైద్యంగానీ ఎందుకు ఇవ్వలేకపోయిందో రాహుల్‌గాంధీ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతుంటే రాహుల్‌గాంధీగానీ, సోనియాగాంధీగానీ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె ప్రశ్నించారు.
ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదీ చేస్తే అది దేశమంతా అనుసరించే పరిస్థితి ఉన్నదని, ఇప్పటికే తెలంగాణ సర్కారు చేసిన ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శనంగా మారాయని కవిత చెప్పారు. నిజామాబాద్ పర్యటనకు వస్తున్న రాహుల్‌గాంధీకి స్వాగతం పలుకుతున్నామని, ఆయన మా అంకాపూర్ చికెన్ రుచి చూడాలని, అంకాపూర్ చికెన్ భారతదేశంలో చాలా పాపులర్ అని కవిత వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

