Mla Sanjay kumar | పేదింటి ఆడపడుచులకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు : ఎమ్మెల్యే సంజయ్కుమార్
Mla Sanjay kumar | పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలు వరంలాంటివని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Mla Sanjay kumar) అన్నారు.
జగిత్యాల : పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలు వరంలాంటివని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Mla Sanjay kumar) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్(Shadi Mubarak)చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
రాయికల్ మండల ధావన్ పల్లి గ్రామానికి చెందిన భూక్య సమీక్ష రాయికల్ లోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి కరీంనగర్ ట్రినిటీ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో ఉచిత సీటు సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను అభినందించారు. ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో సర్పంచ్ యమునా రవీందర్, తదితరులు ఉన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఈద్గా వద్ద పండుగ ఏర్పాట్లను, పారిశుధ్య పనులను ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ నరేష్, డీఈ రాజేశ్వర్, కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్, మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఏఎంసీ వైస్ చైర్మన్ అసిఫ్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు తాజోద్దిన్, జిల్లా ఆర్టీఏ మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

