Sabita indrareddy | అదంతా తప్పుడు ప్రచారం.. పార్టీ మారే ప్రసక్తే లేదు : సబితా ఇంద్రారెడ్డి
Sabita indrareddy | ట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్(BRS) పార్టీ మారే ప్రసక్తే లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabita indrareddy)స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను పార్టీ మారుతున్నట్లు టీవీలు, న్యూస్‌పేపర్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్ : ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్(BRS) పార్టీ మారే ప్రసక్తే లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabita indrareddy)స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తాను పార్టీ మారుతున్నట్లు టీవీలు, న్యూస్‌పేపర్లు, సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్(KCR) సారథ్యంలో గతంలో ఎలా పనిచేశామో.. ఇప్పుడు కూడా పార్టీ కోసం అలాగే పనిచేస్తామని చెప్పారు.
కేసీఆర్ పార్టీలో నాకు సముచితమైన గౌరవం కల్పించారని గుర్తు చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటీవల కొందరు పార్టీలో అనేక పదవులు అనుభవించి కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తేల్చి చెప్పారు.
— Sabitha Reddy (@BrsSabithaIndra) June 30, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

