గవర్నర్‌ది ప్రజాదర్బార్ కాదు.. పొలిటికల్ దర్బార్: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
MLA Jeevan reddy | గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. అది ప్రజాదర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థపై ప్రధాని మోదీ చెప్పేదొకటి చేసేదొకటని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రధాని అయిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్లుగా రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తులను నియమించాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ అన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీకి చెందిన తమిళ్‌సైని రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించడం మోదీ చెప్పిన నియమానికి విరుద్ధమన్నారు. తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలన్నారు. గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయడానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీజేపీ కుట్రలకు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ మహిళా నేతలతో దర్బార్ పెడితే అది మహిళా దర్బార్ అవుతుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నేతలు ఏమైనా సత్యహరిశ్చంద్రులా.. ఎందుకు వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగడం లేదన్నారు. అదే విశయాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

