Harish Roa | కాంగ్రెస్ అవినీతిని బయటపెడ్తం.. ప్రజాసమస్యలపై కేసీఆర్ సారథ్యంలో పోరు: హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
- పౌరసరఫరాల శాఖలో వందల కోట్ల కుంభకోణం
- ఎక్సైజ్‌శాఖలో అక్రమాలను ప్రజలముందు ఉంచుతం
- హామీలు నెరవేర్చుమన్నందుకు నిరుద్యోగులపై లాఠీలా?
- వారి సమస్యలపై అసెంబ్లీలో నేడు వాయిదా తీర్మానం
- రుణమాఫీ, రైతు భరోసా ధోకాపై ప్రభుత్వాన్ని నిలదీస్తం
- ఇస్తామన్న 4వేల పింఛన్ ఎటుపాయె? కొత్తవి ఏమాయె?
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులను గోస పెడ్తున్నరు
- ఢిల్లీతో రేవంత్ సత్సంబంధాలు నిధులు తేలేదెందుకు?
- 25, 26 తేదీల్లో మేడిగడ్డ, కన్నెపల్లిల్లో బీఆర్ఎస్ పర్యటన
Harish Roa | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహాలను తమ అధినేత ఖరారు చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ తరఫున అడ్జెంట్మెంట్ మోషన్లు, కాలింగ్ అటెన్షన్లు, షార్ట్ డిస్కషన్ కింద ఏయే అంశాలు చర్చకు పెట్టాలో, ఏయే అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలో వంటి అంశాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి లోతైన చర్చ చేసినట్టు వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక లక్షలాది మంది విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నరు.
-మాజీ మంత్రి హరీశ్‌రావు
నిరుద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం
నిరుద్యోగ యువతకు ఎన్నో ఆశలు పెట్టి ఇప్పుడు వారికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని హరీశ్ మండిపడ్డారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతున్న నిరుద్యోగుల వీపులను పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏకంగా ఉస్మానియా హాస్టళ్లలో అర్ధరాత్రి చొరబడి దాడులు చేయడం, అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని, అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకున్నదని, నేడు సభలో ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. లక్షలాది మంది నిరుద్యోగులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడించిందని విమర్శించారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని, జాబ్ క్యాలెండర్ వేయాలని, నిరుద్యోగులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, వారిని బూతులు తిట్టి దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సభలో పట్టుపడుతామని తెలిపారు.
వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం
సివిల్ సప్లయీస్ విభాగంలో వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగిందని హరీశ్ తెలిపారు. మూడు నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఎవరికి టెండర్ కట్టబెట్టారు? అని ప్రశ్నించారు. ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినయ్? వడ్లు ఎత్తారా? మిల్లర్ల దగ్గర వడ్లు తీసుకున్నారా? అనేవి చర్చిస్తామని చెప్పారు. రూ.వందల కోట్ల కుంభకోణంపై కూడా వాయిదా తీర్మానం, షార్ట్ డిస్కషన్లో చర్చిస్తామని తెలిపారు. అవినీతి వెనుకఉన్న అదృశ్య శక్తులు ఎవరనేదానిపై మొత్తం బండారం బట్టబయలు చేయాలని, సివిల్ సప్లయీస్ కుంభకోణంపై పోరాడి విషయాలు బయటికి తీయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సన్నబియ్యం కుంభకోణం మరీ దారుణమని హరీశ్ అభివర్ణించారు. సన్నబియ్యం కొనుగోలు టెండర్లు రూ.57కే ఇచ్చారని, మిల్లర్లు రూ.47కే ఇస్తామంటే రూ.57కు ఎలా ఇస్తారని, కిలోకు రూ.10చొప్పున ఎలా కుమ్మక్కయ్యారని ప్రశ్నించారు. సన్నబియ్యంలో కూడా వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడితే టెండర్‌ను అబయెన్స్‌లో పెట్టామన్నారే తప్ప ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.
ఎక్సైజ్‌శాఖలో అదృశ్య శక్తులెవరు?
ఎక్సైజ్‌శాఖలో కొన్ని మద్యం కంపెనీలకు అనుమతులిచ్చే అంశంపై భారీ కుంభకోణం, అవినీతి జరగిందని హరీశ్‌రావు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో బ్లాక్ లిస్టులో ఉన్న సోం డిస్టిల్లరీస్ను మన రాష్ట్రంలో ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఓవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు తెలియకుండానే అనుమతులిచ్చారని అంటున్నారని, ఆయనకే తెలియకుండా అనుమతులిచ్చే అదృశ్యశక్తులు ఎవరు? అనే విషయంపై చర్చించేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఈ అనుమతుల వెనుక కమీషన్ ఎన్ని చేతులు మారిందనే విషయాలు బయటపెడతామని చెప్పారు. తాము గట్టిగా పోరాడితే తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారే తప్ప ఎందుకు రద్దు చేయలేదని? దీనిపై నిలదీస్తామని వివరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతున్న నిరుద్యోగుల వీపులు పగులగొడుతున్నరు. వారిపై అక్రమ కేసులు ఎత్తేయాలి. బూతులు తిట్టి దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని శాసనభలో పట్టుపడతాం.
– మాజీ మంత్రి హరీశ్‌రావు
ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకివ్వడం లేదు?
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో లక్షలాది మంది విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని, అన్ని జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని హరీశ్ తెలిపారు. డబ్బులివ్వకపోతే యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను రోడ్డుపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. *పేదల పొట్టకొడుతరా?
అవ్వాతాతలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని, వందరోజుల్లో అమలు చేస్తామని, ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామని, ఇంట్లో ఉద్యోగమున్నా పెన్షన్ ఇస్తామని, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు 2వేలు కూడా ఇవ్వడం లేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్లన్నీ ఎప్పుడిస్తారో చెప్పాలని పేదల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని చెప్పి వాళ్లకు కూడా అన్యాయం చేశారని, వందరోజులు అని చెప్పి 300 రోజులు దగ్గరపడుతున్నా హామీలకు అతీగతీ లేదని దుయ్యబట్టారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ ఎప్పట్నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు శాంతిభద్రతలు, ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి అంశాలను కూడా ప్రస్తావిస్తామన్నారు.
అవ్వతాతలకు 4వేలు, దివ్యాంగులకు 6వేల పింఛన్ ఇస్తమన్నరు . కొత్త పింఛన్లు అన్నరు. వందరోజుల్లోనే అమలు చేస్తమని చెప్పి 300 రోజులు దగ్గరపడుతున్నా ఉన్న 2వేలు కూడా ఇస్తలేరు.
– మాజీ మంత్రి హరీశ్‌రావు
నీ సత్సంబంధాలు ఏమైనయ్?
సీఎం తన అసమర్థత కప్పి పుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేయడం పెద్ద జోక్ అని హరీశ్ అన్నారు. తాము ఎన్నోసార్లు నిధుల కోసం కేంద్రానికి దండం పెట్టినట్టు గుర్తుచేశారు. రాష్ర్టానికి నిధుల కోసం సీఎం తన 8 మంది ఎంపీలతో పోరాటం చేయించాలని, తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరనే అంశంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీతో మాట్లాడించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేయించాలని చెప్పారు. రాష్ర్టానికి ఒక్క ప్రాజెక్టయినా సాధించడంలో సీఎం అసమర్థత స్పష్టంగా కనిపించిందని దుయ్యబట్టారు. ‘నీ సత్సంబంధాలు ఏడపోయినయ్?’.. పక్క రాష్ర్టాలకు నిధుల వర్షం కురుస్తుంటే.. నీకెందుకు మొండిచెయ్యిచ్చారు? అది ఫెల్యూర్ కాదా?’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక లక్షలాది మంది విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. యాజమాన్యాలు సర్టిఫికెట్లు, టీసీలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నరు.
-మాజీ మంత్రి హరీశ్‌రావు
బడ్జెట్ అనంతరం ప్రాజెక్టుల పరిశీలన
25న బడ్జెట్ తర్వాత మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్టు హరీశ్ తెలిపారు. గోదావరిలో వరద ప్రవాహం నేపథ్యంలో కన్నెపల్లి పంపులు ఆపరేట్ చేసి, రైతులకు నీరందించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ పనిచేయడం లేదని, సర్కారు మొండి వైఖరితో అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. దీన్ని ప్రజలకు తెలుపాలని, కొండపోచమ్మ, మల్లన్న, రంగనాయక్ సాగర్, అనంతగిరి, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ, ఎల్ఎండీకి నీళ్లు మళ్లించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. బడ్జెట్ తర్వాత బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు అంతా కలిసి మేడిగడ్డకు వెళ్తారని తెలిపారు. 25, 26 తేదీల్లో పర్యటన ఉంటుందని చెప్పారు. ఎల్ఎండీలో ఐదు టీఎంసీల నీళ్లు కూడా లేవని, మిడ్ మానేరులోనూ నీళ్లు లేక సాగు, తాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనంతగిరి, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ బోసిపోతున్నాయని వాపోయారు.
వడ్ల కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరిగింది. మూడు నెలల్లో వడ్లు ఎత్తుతమని, డబ్బులు చెల్లిస్తమని చెప్పి ఎవరికి టెండర్ కట్టబెట్టిన్రు? ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినయ్? మిల్లర్ల దగ్గర వడ్లు తీసుకున్నరా?
-మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయమెప్పుడు?
ఆర్టీసీని ప్రభుత్వపరం చేయాలని, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నన్నదని, అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాల్సి ఉన్నదని, అసెంబ్లీలో బిల్లు పాసైనా, గవర్నర్ ఆమోదం తెలిపినా ఏ రోజు నుంచి అమలు చేస్తారో చెప్పలేక ప్రభుత్వం 8 నెలల నుంచి తాత్సారం చేస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. ఈ విషయంపై శాసన సభలో పోరాడాలని నిర్ణయించినట్టు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతున్నదని, బోనస్ బోగస్ అయిందని మండిపడ్డారు. ఈ అంశాలపైనా చర్చకు పట్టుపడుతామని తెలిపారు. ఎవరెవరు ఏయే సబ్జెక్టులపై మాట్లాడాలనే దానిపై తమ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపైనా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఎల్పీ సమావేశానికి కొందరు రాలేదనే ఆరోపణలపై స్పందించిన హరీశ్‌రావు వారు పార్టీకి చెప్పే విదేశాలకు వెళ్లారని వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, సబితా ఇంద్రారెడ్డి, చింతా ప్రభాకర్, కోవా లక్ష్మి, విజయుడు, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, సురభి వాణిదేవి పాల్గొన్నారు.
బీఏసీ భేటీ సమాచారం ఇవ్వరా?
బీఏసీ సమావేశం గురించి సమాచారం ఇవ్వకపోవడంపై హరీశ్‌రావు అసెంబ్లీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏసీకి హాజరయ్యే ఎమ్మెల్యేల సమాచారాన్ని తాము ముం దస్తుగా అందించినా తమకు సమాచారం ఇ వ్వకపోవడంపై మండిపడ్డారు. సభా సంప్రదాయాలను కాపాడేందుకే సభ వాయిదా పడినా వెళ్లకుండా అధికారుల సమాచారం కోసం ఎదురుచూశానని చెప్పారు. గతంలో తాను కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశానని, సభా సంప్రదాయాలు పాటించాలని సూచించారు. ఈ తరహా పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటామని అధికారులు సర్దిచెప్పడంతో బీఏసీ భేటీకి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి హరీశ్ హాజరయ్యారు.
బడ్జెట్ సమావేశాలు 4 రోజులేనా?
హామీలు ఎత్తివేయడమే కాదు.. శాసనసభ సమయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభు త్వం ఎత్తివేస్తున్నదని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. అసెంబ్లీని నాలుగు రోజుల్లో ముగించే లా ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఇంత తక్కువ సమయంలో బడ్జెట్ సమావేశాలు ముగించిన చరిత్ర ఏనాడూ లేదని గుర్తుచేశారు. మంగళవారం బీఏసీ సమావే శం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి హరీశ్ మాట్లాడుతూ బడ్జెట్‌పై గతం లో 8 -10 రోజులు చర్చ జరిగేదని, పద్దుల మీద 4రోజుల నుంచి 8రోజుల వరకు మా ట్లాడిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. కానీ ఈ సారి రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పెట్టారని, ఒకేరోజు 15-20 పద్దులపై చర్చ జరగాలనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని చెప్పారు.
గతంలో కాంగ్రెస్ నాయకులు 10, 12 రోజులు సమావేశాలు పెట్టినా కొద్ది రోజులే పెడుతున్నారని విమర్శలు చేసేవారని, నెల రోజులు సమావేశా లు నిర్వహించాలని అడిగేవారని గుర్తుచేశా రు. 15 రోజులైనా చర్చ జరగాలని బీఏసీలో బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేసినట్టు చె ప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో 9 అంశాలపై చర్చించాలని బీఏసీ దృష్టికి తీసుకుపోయినట్టు తెలిపారు. బుధవారం నిరుద్యోగుల అంశంపై చర్చించాలని కోరినట్టు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల వైఫ ల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత, ఆంక్షలు లేకుండా రుణమాఫీ, అన్ని పంటలకు బోనస్, రైతు భరోసా, పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య లోపం, స్థానిక సంస్థలకు నిధులు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు, పెండింగ్ బిల్లుల విడుదల వంటి తొమ్మిది అంశాలపై సభలో చర్చ పెట్టాలని బీఏసీలో కోరినట్టు తెలిపారు. అసెంబ్లీలో చర్చించాల్సిన ఎజెండాను మంగళవారం నాటికి కూడా ఖరారు చేయలేదని, బుధవారం జరిగే చర్చను మంగళవారం సాయంత్రం నిర్ణయిస్తే ఎలా సిద్ధమవుతారని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

