హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే గణేష్ బిగాల ( Ganesh Bigala ) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం గణేశ్ బిగాల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేల పక్షాన, రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.