తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చల్లా దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.