హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీతారామ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగ్ పనుల అంశాలపై చర్చించేందుకు మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పనుల పురోగతి, భూసేకరణ అంశాలపై చర్చించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టులో సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ప్యాకేజీ 9, 10 పనులను వెంటనే పూర్తి చేసి అక్టోబర్ చివరి నాటికి నీళ్లివ్వాలని ఆదేశించారు. ప్యాకేజీ 11, 12 పనులు మే 2027 నాటికి పూర్తిచేస్తామని, జూలూరుపాడు టన్నెల్ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా కాలువలపై సోలార్ విద్యుత్ వినియోగం అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.