BC Community | బీసీ ముసలం.. రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమే!
రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని రాష్ట్ర ప్రణాళిక శాఖ సర్వే లెక్కతేల్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
- ముస్లిం బీసీలు కలిపితే మొత్తం 56.33 శాతం
- 96.9 శాతం మంది ఇచ్చిన డాటాతో సర్వే పూర్తి
- 16 లక్షల మంది వివరాలు సేకరించలేకపోయాం
- రేపు క్యాబినెట్లో చర్చ.. తర్వాత అసెంబ్లీ ముందుకు
- వివరాలను వెల్లడించిన సబ్‌కమిటీ చైర్మన్ ఉత్తమ్
BC Community | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీసీల జనాభా 46.25 శాతమని, 10.08 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుపుకొంటే మొత్తం 56.33 శాతమని రాష్ట్ర ప్రణాళిక శాఖ సర్వే లెక్కతేల్చినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర జనాభా మొత్తంగా 3.70 కోట్ల మంది కాగా, వారిలో 16 లక్షల మంది (3.1శాతం) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గత నవంబర్‌లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల) నిర్వహించిన విషయం తెలిసిందే. సర్వేకు సంబంధించిన నివేదికను ప్లానింగ్‌శాఖ పుస్తకం రూపంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మం త్రివర్గ ఉపసంఘానికి ఆదివారం అందజేసింది.
ఈ సందర్భంగా సర్వే నివేదికపై సబ్‌కమిటీ కో చైర్మన్ దామోదర రాజనర్సింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క సచివాలయంలో ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్లానింగ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి, అధికారుల బృందంతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే నివేదిక వివరాలను వెల్లడించారు. 50 రోజుల్లోనే కులగణన పూర్తి చేయడం చరిత్రాత్మకమని చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా 3.70 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 3,54,77,554 (96.9 శాతం) మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని తెలిపారు. 3.1 శాతం కుటుంబాలు తమ వివరాలను వెల్లడించలేదని తెలిపారు. 1.03 లక్షల ఇండ్లు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండడం వంటి సమస్యలతో మొత్తంగా 16 లక్షల కుటుంబాల వివరాలను సేకరించలేదని వివరించారు.
డాటా ద్వారా సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. సర్వే నివేదికపై 4న మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తీసుకుంటామని, అదే రోజు అసెంబ్లీలో చర్చకు పెడతామని వెల్లడించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ సర్వే తెలంగాణ చరిత్రలో ఓ స్వర్ణాధ్యాయమన్నారు. మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమే ఈ సర్వే అని వ్యాఖ్యానించారు. సీతక మాట్లాడుతూ ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన అవసరముందన్నారు.
4న అసెంబ్లీలో చర్చ
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 4న ఉదయం 10 గంటలకు కొనసాగనుంది. అదేరోజున ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రణాళికా విభాగం సమర్పించిన సమగ్ర ఇంటింటి కులగణన సర్వే నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. నేడు ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయకమిషన్ తమ నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి అందించనున్నది.

సర్కారు తేల్చిన సర్వే లెక్క
రాష్ట్రంలోని మొత్తం కుటుంబాలు : 1.15 కోట్లు
సర్వే చేసిన కుటుంబాలు : 1.12 కోట్లు
సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు : 3.1%
46.25% బీసీలు
10.08% ముస్లిం బీసీలు
15.79% ఓసీలు
17.43% ఎస్సీలు
10.45% ఎస్టీలు
ప్రణాళికశాఖ నివేదించిన ఇంటింటి సర్వే (కులగణన) వివరాలు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

