మహిళాశక్తి క్యాంటీన్లు బ్రాండ్‌గా ఎదగాలి
మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక చెప్పారు. మహిళా సంఘాల మరింత బలోపేతానికే మహిళా శక్తి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు.
- సంఘాల బలోపేతానికే వడ్డీలేని రుణాలు
- కల్తీ పదార్థాలు, వస్తువులపై అధికారులు, మహిళా సంఘాలు యుద్ధం చేయాలి
- డీఆర్డీవోల సమీక్షలో మంత్రి సీతక
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక చెప్పారు. మహిళా సంఘాల మరింత బలోపేతానికే మహిళా శక్తి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని, కల్తీ వస్తువులపైన అధికారులు, మహిళా సంఘాలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా డీఆర్డీవో, అదనపు డీఆర్డీవోలతో మహిళా శక్తి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారీపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సంస్థ సీఈవో కాత్యాయనీతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో పల్లె రుచులు, ఇప్పపువ్వు లడ్డులు, నన్నారి వంటి సంప్రదాయక పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని సూచించారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వమే అందజేస్తున్నదని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వాలకే రుణాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని తెలిపారు. ఆగస్టు 15 వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరో జత యూనిఫామ్ ఇచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో పీఆర్ ఆర్డీ స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, ఈఎస్డీ కమిషనర్ రవికిరణ్, శ్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు, డీఆర్డీవోలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

