కరోనా నివారణకు కఠిన చర్యలు: మంత్రి సత్యవతి
కరోనా నివారణ| కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్: కరోనా నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కరోనా పరిస్థితులను గురించి ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. మహమ్మారిని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలని చెప్పారు. అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడిపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు తగ్గినప్పటికీ మరణాల సంఖ్య పెరిగింది. వైరస్ ప్రభావంతో కొత్తగా 43 మంది మృతిచెందారు. నిన్న రాత్రి 8 గంటల వరకు 3,804 మంది బాధితులు కోలుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,01,783కు చేరింది. ఇందులో 3,34,144 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 65,597 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2,042 మంది ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇక ఏ కరోనా వ్యాక్సిన్ కావాలో మీరే ఎంచుకోవచ్చు!
ఇండియాకు అండగా ఉంటాం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల
ముఖ్యమంత్రి వెంటే బెంగాల్ ప్రజలు: ఎంపీ నుస్రత్ జహాన్
ఇండియా మాకు సాయం చేసింది.. మేమూ చేస్తాం: అమెరికా అధ్యక్షుడు
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

