రంగారెడ్డి: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన (Koti Vruksharchana) కార్యక్రమాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి ఫారెస్ట్రెక్ పార్కులో (Forestrek park) మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఆ పార్కును కూడా ఎంపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మంచిరేవులలో నాడు వందలాది ఎకరాల అటవీ భూమి భవన నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్ యార్డుగా మారి, పరిసరాల్లో తీవ్రమై న దుర్వాసన వ్యాపించేది. నేడు అదే ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే ఫారెస్ట్రెక్ పార్క్‌గా రూపుదిద్దుకున్నది. 256 ఎకరాల స్థలాన్ని అటవీశాఖ, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) సంయుక్తంగా ఫారెస్ట్ ట్రెక్ పార్కుగా తీర్చిదిద్దాయి.
ఈ పార్కులో తాగునీటి ప్లాంట్, టాయిలెట్ బ్లాక్, వాచ్ టవర్, గ్రామ దేవత గుడి, ఓపెన్ వ్యాయామశాల, వాకింగ్ ట్రాక్, రాక్ పెయింటింగ్, ట్రెక్కింగ్ యాంఫీ థియేటర్, జలపాతం, బ్యాలెన్సింగ్ రాళ్లు, పిల్ల ఏనుగు, డేగ ముఖం, రచ్చ బండలు, సిట్టింగ్ బెంచీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగర ఆకాశ హార్మ్యాలను చూసేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ అదనపు ఆకర్షణగా నిలువనుంది.
మంచిరేవులలో ఫారెస్ట్రెక్ పార్క్ వల్ల నెలకు సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం సమకూరనున్నది. 11 మందికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధి లభించనున్నది. పార్లో రోజూ వందలాది మంది సందర్శకుల సేద తీరనున్నారు. ట్రెకింగ్ సౌకర్యంతో ప్రతి ఆదివారం 2,000 మంది వరకు సందర్శించనున్నారు. పర్యాటకులకు మరింత ఆకర్షణ కోసం చిన్నచిన్న కొండలు సైతం నిర్మించారు.
Wrapping up India's Diamond Jubilee Independence Day festivities, the Hon'ble Chief Minister has announced the #KotiVruksharchana initiative across #Telangana aimed at promoting a greener tomorrow.
I had the honor to participate in a tree-planting event at Forest track park,… pic.twitter.com/kzb8T98kdl— Santosh Kumar J (@SantoshKumarBRS) August 26, 2023