TS Assembly | కార్గో పార్శిల్ సేవల ద్వారా రూ. 62.02 కోట్ల ఆదాయం : మంత్రి పువ్వాడ అజయ్
TS Assembly | టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్ సేవల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్ సేవల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అజయ్ కుమార్ సమాధానం ఇచ్చారు.
కార్గో పార్శిల్ సర్వీసులతో కస్టమర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పికప్, హోం డెలివరీ పార్శిల్ సర్వీసులను ప్రవేశపెట్టాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. ప్రస్తుతం 195 కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. సమీప భవిష్యత్‌లో మరో 50 కార్గో వాహనాలను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.
ఆర్టీసీకి సంబంధించి అదనపు ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్గో పార్శిల్ సేవలను గత ఏడాది జూన్‌లో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కార్గో పార్శిల్ సేవలు 177 బస్ స్టేషన్ల నుంచి ఆపరేట్ చేస్తున్నాం. దాదాపు బల్క్ వస్తువుల రవాణా కోసం ఓల్డ్ బస్సులను వినియోగిస్తున్నాం. 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో బస్సులు 150, 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో బస్సులు 35, ఓపెన్ కార్గో బస్సులు 10 ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ డీలక్స్ బస్సుల్లో కూడా కొరియర్స్, చిన్న పార్శిల్‌ను రవాణా చేస్తున్నామని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్‌డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
Payal Rajput | రాధికా ఆప్టే వ్యాఖ్యలకు పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘టాలీవుడ్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా!’
Khammam SDRF | గల్లంతైన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం.. ఒకరి కోసం గాలింపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

