అడవులను నరికేయొద్దు.. పరిరక్షించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
Minister Prashanth Reddy | పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహ నిర్మాణ శాఖా
నిజామాబాద్ : పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ భావించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నారు. పోడు భూముల సమస్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా బుధవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యల గురించి, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత గురించి మంత్రి ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.
ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న పేదవారికి ఆఖరి అవకాశంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే, ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అటవీ ప్రాంతంలోని ఏ ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురికాకుండా అడుగడుగునా బీట్ స్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది నిరంతరం డేగ కన్నుతో నిఘాను కొనసాగించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఏ ఒక్క చెట్టును నరికినా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయమై ఇక నుండి భవిష్యత్తులో తమ తమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడుకోవడానికి అంకితభావం, చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా ఫారెస్ట్ రేంజ్‌ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ బీటలు, సిబ్బంది సంఖ్యా తదితర వివరాలను మంత్రి ఆరా తీస్తూ, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయాలని నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాకు, కామారెడ్డి అటవీ శాఖ అధికారి నిఖితకు సూచించారు.
హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. మరో మూడు శాతం కలుపుకొని మొత్తంగా తొమ్మిది శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను నివారించుకుని సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హితవు పలికారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చర్యలు, గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయిలలో కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తులు గురించి కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు.
నిజామాబాద్, కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం స్టేట్ ఛాంబర్లో వేరు వేరుగా జరిగిన సమీక్షా సమావేశంలో విప్ గంప గోవర్ధన్, శాసన మండలి సభ్యులు వీ గంగాధర్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే షిండే, కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబ్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, చంద్ర మోహన్, డీటీడీపీవో జయసుధ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యామ్ సుందర్ రెడ్డి, అటవీ శాఖ డీఎఫ్‌వోలు, రేంజ్ అధికారులు, డీఎల్పీవోలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

