Minister Ponnam | అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం : మంత్రి పొన్నం
Minister Ponnam | సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్లో(Sub station) జరిగిన అగ్ని ప్రమాదంలో( Fire incident) ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు.
హైదరాబాద్ : సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్లో(Sub station) జరిగిన అగ్ని ప్రమాదంలో( Fire incident) ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు. సబ్ష్టేన్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. పీటీఆర్ పేలిపోవడం వల్లే సబ్ స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పామన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు.
జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని మంత్రి చెప్పారు. కాగా, సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రమాదంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. దీంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. విద్యుత్ ట్రిప్ కావడంతో ప్రమా దం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం విష యం తెలియగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

