నా కొడుకుల్లారా..ముడ్డిబొక్క పగలగొడ్తా! నక్రాల్ చేస్తున్నరా
నా కొడకల్లారా.. నక్రాలు చేయకుర్రి.. ముడ్డి బొక్క పగలగొడుతా’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మరో ఆడియో లీకైంది. ఈసారి సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అడిగిన తిరుపతిగౌడ్ అనే వ్యక్తిపై మంత్రి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన వాయిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
- మంత్రి పొన్నం మరో వాయిస్ లీక్..
- సోషల్ మీడియాలో ఆడియో వైరల్
- సబ్‌స్టేషన్ గురించి మాట్లాడేందుకు
- ప్రయత్నించిన తిరుపతిపై మండిపాటు
కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా కొడకల్లారా.. నక్రాలు చేయకుర్రి.. ముడ్డి బొక్క పగలగొడుతా’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మరో ఆడియో లీకైంది. ఈసారి సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అడిగిన తిరుపతిగౌడ్ అనే వ్యక్తిపై మంత్రి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడిన వాయిస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే.. హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తిలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ విజ్ఞప్తితో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేసింది. అయితే, పాఠశాల పక్కన ఉన్న స్థలంలో ఏర్పాటు చేయటానికి వీల్లేదని నాడు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం కాలేదు. తాజాగా, ఈ నెల 14న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ స్థలంలోనే సబ్‌స్టేషన్ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సబ్‌స్టేషన్ పనులు పాఠశాల పరిధిలో ప్రారంభిస్తే అడ్డుకుంటామని ఒక రోజు ముందుగానే బీఆర్ఎస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ గ్రామానికి చెందిన తిరుపతిగౌడ్ అనే వ్యక్తి.. సబ్‌స్టేషన్‌ను వేరో చోటపెట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నంకు (ఈనెల 13న) ఫోన్ చేశారు. అవతలి వ్యక్తిని పూర్తిగా మాట్లాడనివ్వకుండానే మంత్రి ఊగిపోయారు. వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇటీవల కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో గతంలో పనిచేసిన హనుమకొండ ఆర్డీవో, కమలాపూర్ తహసీల్దార్ మాధవి, మంత్రి మధ్య జరిగిన సంభాషణ కూడా లీకైన విషయం తెలిసిందే. దీంతో సదరు ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు మంత్రి పొన్నం ఫిర్యాదు చేసిన తీరు వివాదాస్పదమైంది. ఇంతలోనే మరో ఆడియో లీక్ కావటం గమనార్హం.
లీకైన ఆడియో సంభాషణ ఇదీ..
తిరుపతి : సర్.. నమస్తే
మంత్రి : నమస్తే
తిరుపతి : అమ్మనగుర్తి తిరుపతిగౌడ్ సర్.. నేను
మంత్రి : చెప్పయా..!
తిరుపతి : మీరు అమ్మనగుర్తి వస్తున్నారు కదా
మంత్రి :అవును
తిరుపతి : అది.. స్కూల్లో.. బయట గవర్నమెంట్ ల్యాండ్స్ బొచ్చెడు ఉన్నాయి.. స్కూల్లో.. అదీ..!
మంత్రి : ఎందుకు ఇచ్చిండ్రు పర్మిషన్? బుద్ధి లేదా వెధవ నా కొడుకులకు? నేను తీసుకున్నానా పర్మిషన్? ఆ.. వాడెవడయ్యా నన్ను ఆపుతా అంటడు. మంచిగా రెక్వెస్ట్ చేస్తే ఆగుత. అడ్డుకుంటామంటే ముడ్డి పగులకొడుతా నా కొడుకుల ఒక్కొక్కళ్ల..
తిరుపతి : రిక్వెస్టే
మంత్రి : ఏం తమాషా దొబ్బుతుండ్రా బోసిడి నా కొడుకులు? నేను తీసుకున్నానా పర్మిషన్ సబ్‌సేష్టన్‌కు? నలుగురు పిల్లలు లేరు మీ ఊరోళ్లంతా. ఎవ్వరిచ్చిర్రో పర్మిషన్ ఇచ్చిర్రు. ఎవ్వడైనా అడ్డుకుంటే చెప్తా. ముడ్డి బొక్క రాలగోడుతా. నకరాలు చేయకుర్రి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

