భూ రీసర్వేను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రీసర్వే ద్వారా దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిషారం లభించేలా అధికారులు పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. బుదవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..
-
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రీసర్వే ద్వారా దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిషారం లభించేలా అధికారులు పారదర్శకతతో పనిచేయాలని సూచించారు. బుదవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..
రీసర్వే అనంతరం భూమి విస్తీర్ణం వివరాలను రైతులకు తక్షణమే తెలియజేయాలని, అభ్యంతరాల స్వీకరణపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. నోటీసుల జారీ తర్వాత గ్రామాల్లో ప్రతి 15 రోజులకు ఒకసారీ చాటింపు వేయించడంతోపాటు కలెక్టర్లు స్వయంగా గ్రామాల్లో పర్యటించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పాలేరు నియోజకవర్గ పరిధిలోని 141 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 708 రోవర్లతో సర్వే కొనసాగుతున్నదని, వారం రోజుల్లో మరో 400 రోవర్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. సర్వేలో ఉత్తమ పనితీరు కనబరిచిన నల్లగొండ, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను మంత్రి అభినందించారు.
నిజామాబాద్ జిల్లా పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేగం పెంచాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, 22-ఏ భూముల సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, హనుమకొండ కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి కేటాయింపులు చేపట్టాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

