Koheda Market | సకల హంగులతో కోహెడ మార్కెట్.. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తాం : మంత్రి నిరంజన్ రెడ్డి
Koheda Market | సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో అధునాతంగా నిర్మిస్తామని తెలిపారు.
Koheda Market | హైదరాబాద్ : సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో అధునాతంగా నిర్మిస్తామని తెలిపారు.
పండ్లమార్కెట్ నిర్మాణంపై హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కోహెడ మార్కెట్లో వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ ఉండబోతుందన్నారు. 48.71 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 16.50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తామన్నారు. 11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 56.54 ఎకరాల్లో రహదారులు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకున్న తర్వాత మార్కెట్ నిర్మాణ ప్రణాళికను ప్రారంభిస్తాం అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి వివరించిన ప్రణాళిక పట్ల ఎంఐఎం ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

