వనపర్తిలో ఆర్టీపీసీఆర్ పరీక్షా సెంటర్ : మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి | వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.కోటి 16 లక్షలతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి

వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.కోటి 16 లక్షలతో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో వనపర్తిలో అందిస్తున్న, అందించాల్సిన సేవలు, వసతులపై సమీక్ష నిర్వహించారు.
గాంధీనగర్ పాఠశాలలో సెంటర్ ఏర్పాటు చేశామని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అందుబాటులో 150 ఆక్సిజన్ బెడ్లు, 2 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నేత మామిడిమాడ రంగారెడ్డి కుమారుడి సహాయంతో త్వరలో మరో వెంటిలేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. సెకండ్ వేవ్ లో 53046 మందికి పరీక్షలు నిర్వహించగా 6384 మందికి కరోనా నిర్దారణ అయిందన్నారు.
35 మంది మినహా అందరూ సురక్షితంగా ఉన్నారన్నారు. 52 మంది ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 98 శాతం మంది కరోనా నుండి బయటపడుతున్నారని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వారు అనవసరంగా ఆందోళన చెందవద్దని, కేవలం 2 శాతం మందికి మాత్రమే తీవ్రంగా ఉంటున్నదన్నారు. అనస్థీషియా డాక్టర్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఈ రెండు నెలలకు అవసరమైన వైద్యులను వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుని వారు విధులలో చేరేలా చూసుకోవాలన్నారు. విధులకు రానివారి స్థానంలో మరొకరిని నియమించుకోవాలన్నారు. గ్రామాలలో 45 ఏళ్లు నిండిన అందరూ వెంటనే టీకా వేయించుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ హరీష్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

