ఓటమి భయంతోనే రేవంత్ దాడులు
ఇటీవల కొడంగల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు వచ్చిన జనాలను చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే కిరాయి గూండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని భూగర్భ, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి విమర్శించారు.
- మీడియా సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి
కోస్గి, నవంబర్ 15: ఇటీవల కొడంగల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు వచ్చిన జనాలను చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే కిరాయి గూండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని భూగర్భ, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓపిక పడుతున్నామని, తమ జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి కిరాయి మనుషులను తీసుకొచ్చి.. కోస్గి మండలంలోని సర్జఖాన్పేట్లో సోమశేఖర్‌రెడ్డి అనుచరులపై పథకం ప్రకారం దాడి చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఐదేండ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఇక్కడ ఆయన గెలుపు ఖాయమని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలు కుండ్రు విజయ్‌కుమార్, మైబులను మంత్రి పరామర్శించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఈజీఎస్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఇన్చార్జి లింగంపల్లి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ రాజేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

