సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో రేపు మంత్రి కేటీఆర్ పర్యటన
రేపు మంత్రి కేటీఆర్ పర్యటన | సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని కోర్టు కూడలిలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

నల్లగొండ : సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి ఆయన బయల్దేరి 3 గంటల వరకు సూర్యాపేటకు చేరుకొని కోర్టు కూడలిలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఓల్డ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో రోడ్డు విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 3 గంటల 45 నిమిషాలకు నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం భీమరం గ్రామంలో రైతు వేదిక, వైకుంఠధామం, హైస్కూల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

