T-Works | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా.. టీ అంటే తైవాన్: మంత్రి కేటీఆర్
T-Works | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) నిర్వచించారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు అని ఆయన అన్నారు.
T-Works | హైదరాబాద్ : ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) నిర్వచించారు. సాఫ్ట్‌వేర్‌కు ఇండియా పవర్ హౌస్ లాంటిందని పేర్కొన్నారు. తైవాన్ దేశం హార్డ్ వేర్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది అని గుర్తు చేశారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు అని ఆయన అన్నారు. టీ వర్క్స్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లియూతో పాటు ఆయన బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో ఈ ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో పెట్టుబడులు తెలంగాణకు తరలిరాగా, తాజాగా ఫాక్స్ కాన్ పెట్టుబడులు పెట్టడం, లక్ష మందికి ఉద్యోగ కల్పన చేస్తామని ప్రకటించినందుకు యంగ్ లియూకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌ను షాంజైన్ చేద్దాం..
తెలంగాణ ఉద్యమ సమయంలో తాము నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి పోరాటం చేశాం. ఇవాళ ఫాక్స్ కాన్ వంటి సంస్థల పెట్టుబడులతో తెలంగాణ యువతకు ఉద్యోగాల లభించడం ద్వారా యువత సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫాక్స్ కాన్తో తెలంగాణ ప్రభుత్వ సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అతి చిన్న దేశమైన తైవాన్ ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలో హైదరాబాద్‌ను షాంజైన్ చేద్దాం.. ఆ విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

