హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదు: మంత్రి కేటీఆర్
Minister KTR | రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్, సిమెంటు ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామన్నారు..
బయటి రాష్ట్రాల వాళ్లు బతుకుదెరువుకోసం తెలంగాణకు వస్తున్నారని, కానీ మనవాళ్లు దుబాయ్ పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా క్రెడాయ్ ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన సాయం ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణపై క్రెడాయ్ దృష్టిపెట్టాలని సూచించారు.
సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే విపక్షాలకు తెలుసునని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఏం చేస్తారో విపక్ష నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏడు శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం పూర్తిచేశామన్నారు. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నామని, భవిష్యత్ తరాల కోసం పెట్టే పెట్టుబడిని అప్పులుగా చూడరాదని వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో హైదరాబాద్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్ తయారుకానుందని తెలిపారు. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

