KTR | పేదలకు వరం.. టీ డయాగ్నొస్టిక్ సేవలు.. 134కు పెరిగిన వైద్య పరీక్షలు : మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వైద్య పరీక్షలు పేదలకు భారం కావొద్దనే ఉద్దేశంతో.. తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వైద్య పరీక్షలు పేదలకు భారం కావొద్దనే ఉద్దేశంతో.. తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2018 జనవరిలో హైదరాబాద్‌లో టీ డయాగ్నొస్టిక్ సేవలు ప్రారంభించగా ఇప్పడవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖాలలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
టీ డయాగ్నొస్టిక్ ద్వారా రెండు రకాలు పరీక్షలు నిర్వహిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పాతలాజికల్ సర్వీసుల్లో భాగంగా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఇమేజింగ్ సర్వీసుల్లో భాగంగా ఎక్స్ రే, యూఎస్జీ, ఈసీజీ, 2డీ, ఎకో, మెమోగ్రామ్ సర్వీసులు అందిస్తున్నారని తెలిపారు. డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 57.68లక్షల మంది రోగులు పరీక్షలు చేసుకొని దీని ద్వారా రూ.10.40 కోట్ల లబ్ధి పొందారని వివరించారు. డయాగ్నస్టిక్స్ సెంటర్లలో చేసే పరీక్షలను 134కు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. నీతి అయోగ్ డయాగ్నస్టిక్స్‌ను ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు. డయాగ్నస్టిక్స్ విజయవంతంగా నడిపించడంలో కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావుకు, ఆయన బృందాన్ని కేటీఆర్ అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

