కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం మరువలేనిది : మంత్రి కేటీఆర్
Minister KTR | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమం సహా అనేక పోరాటాలు చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొనియాడారు. బాపూజీ పోరాటాలు మరువలేనివి అని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో మానేరు నది
రాజన్న సిరిసిల్ల : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమం సహా అనేక పోరాటాలు చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొనియాడారు. బాపూజీ పోరాటాలు మరువలేనివి అని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో మానేరు నది సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపూజీకి ఘన నివాళులర్పించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. స్వాతంత్ర్యం రాక ముందే కాదు.. వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో బాపూజీ ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. ఉద్యమంలో తానూ పోరాటం చేయడమే కాదు పోరాట యోధులకు సహకారం అందించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వం జల దృశ్యంలో తన ఇంటిని తీసి బయట పడేశారో అక్కడే ప్రభుత్వం 20 అడుగుల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ వైతాళికుల గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవ్వరూ అడగకుండానే తెలంగాణలో కొత్త జిల్లాలకు, యూనివర్సిటీలకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేరు పెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ వైతాళికులను గౌరవించుకోవాలనే సంస్కారం ప్రభుత్వానికి ఉందన్నారు. సిరిసిల్లలో కొత్త చెరువు ట్యాంక్ బండ్, కొత్త జంక్షన్ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఖర్చులతో మహనీయుల విగ్రహాలు పెట్టుకుందామని చెప్పారు.
మీ ఆశీస్సుల వల్లే ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. మీ రుణం తీర్చుకునేందుకే శాశ్వత సమస్యలకు పరిష్కారం చేస్తున్నానని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన అభివృద్ధి చాలదు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. దశల వారీగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని పేర్కొన్నారు.
వరంగల్‌లో 1250 ఎకరాలలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా 20 – 30 వేల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమం కోసం రూ. 50 లక్షలు విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందజేశారు. రూ. 70 కోట్ల బడ్జెట్‌ను రూ. 1200 కోట్లకు పెంచామని తెలిపారు. కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ తన పాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

