పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Minister KTR | రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను
హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్‌లో డేటా సైన్స్ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడుతున్నదని చెప్పారు. దీంతో నైపుణ్యం కలిగిన 450 మందికిపైగా ఇంజినీర్లు పనిచేస్తారన్నారు.

థర్మో ఫిషర్స్ కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందని చెప్పారు. ఈ సంస్థ పరిశోధన కోసం ఏటా 1.4 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధన చేస్తున్నదని తెలిపారు. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్ ప్రతినిధులను కలిశానని గుర్తుచేశారు.

పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానమని చెప్పారు. నగరంలో ఇప్పటికే ఐడీపీఎల్, ఇక్రిశాట్, సీఎస్ఐఆర్ వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటి సెంటర్లకు కూడా హైదరాబాద్ మంచి ప్రదేశమని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

