ఇది ఎక్కడుందో చెప్పండి..? ట్విట్టర్ యూజర్లకు కేటీఆర్ ప్రశ్న
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యూజర్లకు ఓ ప్రశ్న సంధించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ భవనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? అంటూ కేటీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యూజర్లకు ఓ ప్రశ్న సంధించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ భవనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? అంటూ కేటీఆర్ నెటిజన్లను ప్రశ్నించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఆ భవనం ఆకాశాన్ని తాకినట్లు ఉంది. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆ భవనం చుట్టూ చిన్నచిన్న భవన సముదాయాలు ఉన్నాయి. మరి ఆ భవనం ఎక్కడుందో మీరు పసిగట్టగలరా? ఆ ఫోటోపై మీరూ ఓసారి లుక్కేయండి.
Tweeple, Guess what & where this👇is? pic.twitter.com/eSaJSr18iX
— KTR (@KTRBRS) January 13, 2022
అయితే కేటీఆర్ ట్వీట్ చేసిన ఆ భవనం గురించి తెలుసుకోవాలంటే బంజారాహిల్స్ వెళ్లాల్సిందే. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో మొత్తం నాలుగు టవర్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఒక టవర్‌ను 20 అంతస్తులతో, మిగతా మూడు టవర్లను 16 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన సీపీ
కమాండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో నగరానికి మూడో కన్నుగా మారనుందని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నాలుగు టవర్ల భవనం, 20 అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక మ్యాప్‌లను ఆర్ అండ్ బీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సీపీకి వివరించారు. భవనంలో భద్రత ప్రమాణాలు, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలతో పాటు సమావేశ మందిరాలు, ఆడిటోరియాలు, పార్కింగ్ ప్రాంతాలను సీపీ సందర్శించారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివిధ అంశాల అమలు కోసం ఏజెన్సీలు, విక్రేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీపీ సూచించారు. నగర పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉంటుందని, మార్చి 31వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, అడ్మిన్ డీసీపీ సునీతారెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

