Minister Koppula | దశాబ్దాల కరువును దూరం చేసిన చరిత సీఎం కేసీఆర్దే : మంత్రి కొప్పుల ఈశ్వర్
Minister Koppula | సీఎం కేసీఆర్ ఆలోచన, కృషి ఫలితంగానే తెలంగాణలో దశాబ్దాల కరువుకు చరమగీతం పాడగలిగామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఆధారంగా అక్కపెల్లి చెరువు నింపేందుకు రూ.60.80 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ధర్మపురి, అక్టోబర్ 6 : సీఎం కేసీఆర్ ఆలోచన, కృషి ఫలితంగానే తెలంగాణలో దశాబ్దాల కరువుకు చరమగీతం పాడగలిగామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఆధారంగా అక్కపెల్లి చెరువు నింపేందుకు రూ.60.80 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పోయేవని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ కృషి వల్ల కరువు నేలల్లో జలసిరులు కురుస్తున్నాయన్నారు.
ప్రధానంగా వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టడం, నీటి సంరక్షణ కోసం చేసిన చర్యలు ఫలించడంతో గతంలో కంటే పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడం, ప్రాజెక్టులు నిర్మించుకోవడం.. వంటి చర్యలు భూగర్భ జలాలు పెరగడానికి కారణమయ్యాయన్నారు. పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ప్రజలకు అనుకూలంగా మార్చవచ్చని మన సీఎం కేసీఆర్ నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

