Basar Temple | త్వరలో బాసర ఆలయ పునః నిర్మాణం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Basar Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరహాలోనే దక్షిణభారతంలో ఎంతో ప్రసిద్ధి చేసిన బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.
నిర్మల్ : రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరహాలోనే దక్షిణభారతంలో ఎంతో ప్రసిద్ధి చేసిన బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శనం, ఆగమ నిర్దేశం మేరకు బాసర ప్రధాన ఆలయ పునర్నిర్మాణ ప్రక్రియ జరపాలని సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశానుసారం బాసర ఆలయ బృందం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామిని కలిసింది.
ప్రధాన ఆలయ అభివృద్ధి, విస్తరణ ప్లాన్‌తోపాటు ఆగమ, ఆలయ సంబంధమైన ప్రతిపాదనలు భారతీస్వామి ముందుంచారు. ఇప్పుడున్న గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించడం, అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించేలా ప్రత్యేక నిర్మాణం, మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకారం మండంపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, నలుదిక్కులా రాజగోపురాలు నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ధ్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటుపై శృంగేరి పీఠాధిపతి పలు మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు చేశారు. శృంగేరి పీఠం నుంచి తిరిగివచ్చిన ఆలయ బృందంతో గురువారం ఇవాళ శాస్త్రినగర్‌లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతి చేసిన మార్పులు, సూచనలను మంత్రికి వివరించారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు పాటించాలని, దానికి అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం ప్లాన్‌ను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా క్యూ కాంపెక్స్, కార్యనిర్వహణ అధికారి కార్యాలయం, 100 గదుల చౌల్ట్రీ, దాతల సహాయంతో నిర్మించే 50 వసతి గదులు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకం మాస్టర్ ప్లాన్‌ను పొందించాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణం ప్లాన్‌తో పాటు మాస్టర్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత, ఆయన ఆదేశాల మేరకు పనులు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసిన వారిలో ఈవో విజయ రామారావు, స్థపతి వల్లి నాయగం, ఎస్ఈ మల్లికార్జున్ రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు, పూజారులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

