Minister Indrakaran Reddy | అడవి బిడ్డలను అన్నదాతలను చేసినం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Minister Indrakaran Reddy | ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
నిర్మల్ : ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy)అన్నారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా 4,05,601 ఎకరాలకు చెందిన 1.51 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను(Podu Pattas) పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇకపై పోడు భూములకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. గిరివికాసం పథకం ద్వారా గిరిజన రైతులకు మేలు చేస్తున్నామని, పట్టాదారులు తమ భూముల్లో బోర్లు వేసుకునేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిజేస్తామని వెల్లడించారు. త్రీ ఫేజ్ కరెంట్ కూడా సరఫరా చేస్తామని చెప్పారు.
పోడు రైతులపై ఉన్న కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుందని స్పష్టం చేశారు. హక్కుదారులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేదని, వారసులకు మాత్రమే పోడు భూములపై హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఏజెన్సీలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

