ఇక బస్తీ దవాఖానాలుగా ఏఎన్ఎం సబ్ సెంటర్స్ : మంత్రి హరీశ్‌రావు
వికారాబాద్ : దసరా నుండి ఏఎన్ఎం సబ్ సెంటర్లను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పీ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ శ్రీనివాసరావులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక నేషనల్ గార్డెన్లో నిర్వహించిన ఆశా సమ్మేళన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాథమిక దశలో ప్రజల అనారోగ్య పరిస్థితిని గుర్తించి చికిత్స అందజేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ముందుండి పని చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి జీతాలను అందిస్తూ ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. కరోనా సమయంలో, వాక్సినేషన్ విషయంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తోపాటు సీనియర్ అధికారులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని గుర్తు చేస్తూ… గతంలో ప్రభుత్వ ఆస్పత్రులలో సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని హంగులతో ఆస్పత్రుల భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని మంత్రి అన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 66 శాతానికి పెరిగిందన్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో 80 శాతం ప్రసవాల సంఖ్య పెరగడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఆస్పత్రులలో కంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాల సంఖ్య పెరగడం దీనికి ఉదాహరణ అని మంత్రి తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సేవ మరువలేనిదని, వారి సేవలు అభినందనీయమని మంత్రి అన్నారు. ఆశా వర్కర్లు విశేషమైన సేవలందిస్తూ అమ్మ పాత్రను నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. కరోనా సమయంలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లుగా ప్రస్తుతం కూడా గ్రామాలలో ప్రతి ఇంటింటికి వెళ్లి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా తాండూరులో ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు మంత్రి హరీశ్‌రావు చీరల పంపిణీ చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన పేషంట్ అటెండర్ క్యాంటీన్, రూ. 90 లక్షల వ్యయంతో గంగోత్రి పాఠశాల సమీపంలో చేపట్టే సీసీ రోడ్డు, రైతు బజారులో రూ. 4.50 కోట్ల వ్యయంతో చేపట్టే సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పాత తాండూరులో బస్తీ దవాఖాన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ , వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

