Harish Rao | కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో : మంత్రి హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారని తెలిపారు.
Harish Rao | యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే శుభవార్త చెబుతారని తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు రామన్నపేటలో ఎస్టీవో కార్యాలయం ప్రారంభించారు. రూ. 5.5 కోట్లతో నిర్మించే 50 పడకల ఆసుపత్రికి, రూ.2.5 కోట్లతో నిర్మించే చెన్నకేశవ స్వామి దేవాలయం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇంటింటికి మంచినీళ్లు అందించి, ఆడబిడ్డల కష్టాలు తీర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చే కంటే ముందు.. నీళ్ల ట్యాంకర్లు వచ్చేవన్నారు. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. 50 ఏళ్ల నుండి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అక్కడ చేతకానిది.. ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కేసీఆర్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే అని మంత్రి చెప్పారు. మీ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరెంట్ గురించి ఎంత మాట్లాడితే అంత మంచిది మాకు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా అని ప్రజలనే తీర్పు కోరుదాం. దాని మీదే ఎన్నికలకు పోదాం అని చెప్పారు. ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్ పార్టీవి అని ధ్వజమెత్తారు. అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని దీవించాలి. ఎమ్మెల్యే లింగయ్యకు కనీసం హైదరాబాద్‌లో ఇల్లు కూడా లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

