Minister Harish Rao | కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం : మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao | కేసీఆర్(KCR) అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్లే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao )అన్నారు. ఆదివారం జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదేనని చెప్పారు.
మెదక్ : కేసీఆర్(KCR) అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం వల్లే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao )అన్నారు. ఆదివారం జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదేనని చెప్పారు.
మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీనిచ్చారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ ఇస్తున్నామని మేము చెప్పాం. కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిన్న డీకే శివకుమార్ నిజాలు చెప్పారు. కానీ 5 గంటలు ఇవ్వట్లేదు 3 గంటలే ఇస్తుందని తెలిపారు. డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టుకుంది. స్వయంగా డీకే శివకుమారే 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పాక ఇంకా బస్సెందుకు మాకు కర్ణాటక రావడానికని ఎద్దేవా చేశారు.
రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్లకి సిగ్గు లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని అంటాడు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. తస్మాత్ జాగ్రత్త..మోసపోతే గోస పడుతాం.
మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్లలో మనం పొడుచుకున్నట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతుంది. కాంగ్రెస్ వాళ్లు బట్టేబాజ్ గాళ్లు. వాళ్లవి తిట్లు..మనవి కిట్లు. కాంగ్రెస్ బూతులు కావాలా..తెలంగాణ భవిష్యత్తు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

