ఆన్లైన్లోనే అన్ని శాఖల ఆడిటింగ్ : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్ ఆన్లైన్లో జరిగే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ఆడిటింగ్ ప్రారంభించాలన్నారు. ఆడిట్ శాఖ

హైదరాబాద్ : వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్ ఆన్లైన్లో జరిగే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ఆడిటింగ్ ప్రారంభించాలన్నారు. ఆడిట్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని, ప్రతీ పైసా ప్రజలకు చేరడమే లక్ష్యంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక శాఖ హెచ్వోడీలు, జిల్లా స్థాయి ఆర్థిక, ఆడిట్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో వంద శాతం ఆన్ లైన్ ఆడిటింగ్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రసంశలు పొందిన నేపథ్యంలో ఆ శాఖ వారందరికీ హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆన్లైన్ ఆడిటింగ్‌తో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పూర్తిస్థాయిలో రికవరీ, అభ్యంతరాలు పరిష్కారం చేసేలా అడుగులు వేయాలన్నారు. స్థానిక సంస్థలకు, ఇతర శాఖల నుండి వచ్చే అభ్యంతరాలకు సంబధించిన పేరాలను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో ఈ మూడు నెలల్లో 2400 అభ్యంతరాలను ఆడిట్ చేసి పరిష్కరించడం ద్వారా రూ. కోటి 26 లక్షల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను, ఆడిట్ సిబ్బందిని హరీశ్‌రావు అభినందించారు. ఇదే రీతిలో అన్ని జిల్లాల్లో ఆడిట్ మీటింగ్స్ పెట్టి పూర్తిగా అభ్యంతరాలను పరిష్కరించాలి అని ఆదేశించారు. ఈ ఐదారు నెలల్లో ఆయా శాఖలకు సంబంధించి పూర్తిగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆడిట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజా ధనం వ్యర్థం కాకూడదు..
ప్రజా ధనం వ్యర్థం కాకుండా సరైన రీతిలో వినియోగం అయ్యేలా చూడటమే ఆడిట్ డిపార్ట్మెంట్ ముఖ్య విధి అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆయా శాఖలవారీగా ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిందా? లేదా? అని పకడ్బందీగా ఆడిట్ నిర్వహించాలి. నిధుల దుర్వినియోగం జరిగితే ఆ సమాచారం శాఖల వారీగా తెప్పించాలి అని సూచించారు. జాయింట్ డైకర్టర్లు తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆడిటింగ్ సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు రుణ మాఫీ సరిగా జరిగిందా? లేదా? పరిశీలన జరపాలి. బ్యాంకు వద్ద ఉన్న సమాచారం, సంబంధిత శాఖ వద్ద ఉన్న సమాచారం సరిపోల్చుకోవాలి అని చెప్పారు. అదే రీతిలో వడ్డీలేని రుణాలు, స్వయంసహాయక బృందాలకు రుణాలు సరిగా అందుతున్నాయా? లేదా? పరిశీలించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతీ పైసా లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చడం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
IND vs NZ | టాస్ తర్వాత కూడా వరుణుడి ఆట.. చివరకు రద్దయిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
Anna Konidala | పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. ఇన్స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసిన అన్నా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

