Minister Harish Rao | మన చెత్త-మన బాధ్యత.. మురికి కాలువలో పేపర్లు, కవర్లను తొలగించిన మంత్రి హరీశ్ రావు
వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు.
సిద్దిపేట: వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో (Siddipet) మన చెత్త-మన బాధ్యత అంటూ ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుస్తూ మురికి కాలువలో పేరుకుపోయిన పేపర్లు, కవర్లను స్వయంగా తొలగించారు. చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేసిన విషయం తెలిసిందే.

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించారు.

పూల కుండీలు, కొబ్బరి చిప్పల్లో నిల్వఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

