Minister Harish Rao | ఇంటి పరిసరాలు బాగుంటేనే.. కుటుంబం, సమాజం బాగుంటుంది : మంత్రి హరీశ్ రావు
Minister Harish Rao | ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు.
Minister Harish Rao | హైదరాబాద్: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ (GHMC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు.. దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కోకాపేటలోని తన నివాసంలో 10 నిమిషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీరును స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో అంటు వ్యాధులు (Seasonal diseases) వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.
పూల కుండీలు, కొబ్బరి చిప్పల్లో నిల్వఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పరిశుభ్రమైన పరిసరాలతోపాటు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల్లోని సిబ్బంది వీధులను శుభ్రం చేస్తున్నా.. మన ఇంటి పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలం కాబట్టి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో టీ-డయాగ్నోస్టిక్స్ (T-diagnostics) ద్వారా ఉచితంగా వైద్యపరీక్షలు చేస్తున్నదని వెల్లడించారు. అదేవిధంగా మందులతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ హాస్పిటళ్లను సంప్రదించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

