Huzurabad | పెద్దమ్మ గుడి నిర్మాణానికి హరీశ్‌రావు భూమిపూజ
Huzurabad | హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ గుడికి నిర్మాణానికి మంత్రి

హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ గుడికి నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఆరు నెలల్లో గుడి పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుంటామని తెలిపారు. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్న రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు. చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రూ. 30 లక్షలతో ఈ దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టని ఈటల రాజేందర్‌కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడు. అభివృద్ది కావాలంటే గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించండి. బీజేపీ నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. ధరలు పెంచే బీజేపీ కావాలా పేద ప్రజలను ఆదుకునే టీఆర్ఎస్ కావాలా ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

