కరోనా రోగులకు మంత్రి హరీష్ రావు ఆత్మీయ పలుకరింపు
మంత్రి హరీష్ రావు | సిద్దిపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రి హరీష్ రావు పరామర్శించి, ఆత్మీయంగా

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రి హరీష్ రావు పరామర్శించి, ఆత్మీయంగా పలుకరించారు. అన్నం పెడుతున్నారా.. వసతులు ఎలా ఉన్నాయ్.. మంచిగా చూసుకుంటున్నారా.. అంటూ కొవిడ్ బాధితులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. మీకేం కాదు.. ధైర్యంగా ఉండండి.. తాను ఉన్నానంటూ వారిలో హరీష్ రావు మనోధైర్యం నింపారు.

కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కోవిడ్ పేషెంట్లకు భరోసానిచ్చి, ధైర్యం నింపేందుకు బుధవారం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. పీపీఈ కిట్ ధరించకుండానే కొవిడ్ వార్డుల్లో తిరిగారు మంత్రి. కొవిడ్ కష్టకాలంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు గొప్పవి అని మంత్రి కొనియాడారు. వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సేవలను హరీష్ రావు ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

