నాపై ప్రేమను సేవతో చాటండి
తన పుట్టినరోజైన శుక్రవారంనాడు తాను సిద్దిపేట, హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ముందే నిర్ణయించుకొన్న వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా దూరప్రాంతంలో ఉండాల్సి వస్తున్నదని పేర్కొన్నారు
నేడు సిద్దిపేట, హైదరాబాద్‌లో ఉండటం లేదు
పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): తన పుట్టినరోజైన శుక్రవారంనాడు తాను సిద్దిపేట, హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ముందే నిర్ణయించుకొన్న వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా దూరప్రాంతంలో ఉండాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలకు సూచించారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్నవారిని నిరాశ పరుస్తున్నందుకు మన్నించాలని గురువారం ట్వీట్ చేశారు. అభిమానుల ఆదరాభిమానాలు, ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు.
అభిమానుల ‘హెల్పింగ్ చాలెంజ్’
మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం హెల్పింగ్ చాలెంజ్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయాల్సి ఉంటుంది. సహాయం పొందినవారితో సెల్ఫీ దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. ఇదేవిధంగా సహాయం చేయాలని స్నేహితులకు కూడా చాలెంజ్ విసరాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

