TS Council | ఆయుష్మాన్ భారత్‌కు రూ. 259 కోట్లు ఖర్చు చేశాం : మంత్రి హరీశ్‌రావు
TS Council | రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కోసం రూ. 259,51,42,842 ఖర్లు చేశామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఈ ఏడాది మే 18 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. శాసనసమండలిలో

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కోసం రూ. 259,51,42,842 ఖర్లు చేశామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఈ ఏడాది మే 18 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. శాసనసమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య శ్రీ పథకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.
2014-21 వరకు పది లక్షల 39 వేల 86 మంది ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందారు అని హరీశ్‌రావు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని జనాభాలో తక్కువ మందికి మాత్రమే లాభం కలుగుతుంది. 26 లక్షల 11 వేల కుటుంబాలకు మాత్రమే వైద్య సేవలు అందుతాయి. ఇక 87 లక్షల 50 వేల కుటుంబాలకు ఆరోగ్య శ్రీకింద వైద్య సేవలు అందుతాయి. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే 60 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు దూరం అవుతాయి. అందుకు ఈ పథకంలో చేరవద్దని అనుకున్నాం. కొన్ని కేసులు ఆరోగ్య శ్రీలో కవర్ కానివి… ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయ్యాయి. విసృత ప్రయోజనాల రీత్యా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ కలిపి అమలు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆయుష్మాన్ భారత్ కింద రాని కేసులకు అయ్యే మొత్తాన్ని కలిపి అమలు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కింద 1 లక్ష 18 వేల 247 మందికి వైద్య సేవలు అందాయి. ఇందు కోసం రూ. 259 కోట్ల 51లక్షల 42 వేల 842 ఖర్చు చేశాం. ఈ పథకాన్ని మే 18 నుంచి అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్యం ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కొన్నాం. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ప్రభుత్వ రంగంలోనే అత్యాధునిక సౌకర్యాలు కల్పించి కరోనా వైద్య సేవలు అందిస్తున్నాం అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

