సివిల్స్ ర్యాంకర్లకు మంత్రి హరీశ్‌రావు అల్పాహార విందు
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్ ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత.. హైదరాబాద్‌లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్బీ అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికిపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు.
సీఎస్బీ అకాడమీ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని, దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎస్బీ అకాడమీ ద్వారా మరింతమంది సివిల్స్ ర్యాంకర్లను దేశానికి అందిస్తామని ఆమె హామీనిచ్చారు. ఇప్పటికే తెలుగువారు పెద్దసంఖ్యలో సివిల్స్ విజేతలుగా నిలిచారన్నారు. మంత్రిని కలిసిన వారిలో సుధీర్‌కుమార్‌రెడ్డి (ర్యాంక్-69), అరుగుల స్నేహ (136), బీ చైతన్య రెడ్డి (161), రంజిత్‌కుమార్ (574), స్మరణ్‌రాజ్ (676)తో పాటు ఎన్ఆర్ఐ మల్లవరపు సరిత ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

