ఫులే ఆశయ సాధన దిశగా కేసీఆర్ పాలన
మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని,
- జ్యోతిబా ఫులేకు మంత్రి గంగుల నివాళి
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను సాధించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని, బలహీనవర్గాలకు ముందెన్నడూ లేనివిధంగా లబ్ధి చేకూరుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. సోమవారం ఫులే వర్థంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన జ్యోతిబాఫులే చిరస్మరణీయుడని సోమవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
సీఎం కేసీఆర్ బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో 310 బీసీ గురుకులాలను మహాత్మా జ్యోతిబాఫులే పేరిట ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. 41 బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన 87 ఎకరాల స్థలం కేటాయించారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో బీసీల వాటాను సగర్వంగా అందిస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

