Minister Gangula | బీసీలకు రూ. లక్ష సాయం నిరంతర ప్రక్రియ : మంత్రి గంగుల
Minister Gangula | రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి బీసీలకు రూ.లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) వెల్లడించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి బీసీలకు రూ.లక్ష సహాయం పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) వెల్లడించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee )భేటీలో మంత్రులు హరీష్ రావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
మంత్రి గంగుల మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల(Backward Classes) అభ్యున్నతికి సీఎం కేసీఆర్(CM KCR) నిరంతరం తపిస్తారని తెలిపారు. కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. శనివారం వరకు 2,70,000 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని వివరించారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తామని వెల్లడించారు.
ప్రతి నెలా 5వతేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. ఇన్చార్జి మంత్రులు(Incharge Ministers) ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతీ నెల 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా సహాయాన్ని అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారాన్ని ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గాని సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.
ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు . లబ్ధిదారుల అభివృద్ధి కోసం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని అన్నారు. నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీసీ సహాయం పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్,అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

