ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మానేరు రివర్ ఫ్రంట్ : మంత్రి గంగుల కమలాకర్
యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆధునిక హంగులతో మానేరు ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెనపై రూ.6.5కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులను మంత్రి ప్రారంభించారు.
Minister Gangula kamalakar | యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఆధునిక హంగులతో మానేరు ఫ్రంట్‌ను నిర్మిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు వంతెనపై రూ.6.5కోట్లతో ఏర్పాటు చేయనున్న డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంతెనెకు హంగులు తీసుకువచ్చేందుకు డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులను ప్రారంభించుకోనున్నట్లు పేర్కొన్నారు.
అల్గునూర్ వంతెనపై నిలబడి చూసినా స్పష్టంగా కనిపించేలా జర్మన్ టెక్నాలజీతో మానేరు వంతెనకు ఇరువైపులా రెండు చొప్పున నాలుగు టీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పలు పారిశ్రామిక రంగాల దృష్టిని సైతం ఆకర్షించడంతో హోటల్ మొదలగు వాటి ఏర్పాటు పలువురు ముందుకువస్తున్నారని తెలిపారు. మానేరు వెంతన నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యిందని, ఉపాధికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అప్పర్, లోయర్ ప్రామినెడ్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ వాటర్ ఫౌంటెన్లు ప్రపంచవ్యాప్తంగా మూడు దేశాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. చైనా, సౌత్ కొరియాలోని సియోల్ తర్వాత కరీంనగర్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్‌రావు, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి, కరీంనగర్, జిందా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఆర్డీవో ఓ ఆనంద్ కుమార్, కొత్తపెల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు, డీఈ రవీందర్, ఏఈ రాజాశేఖర్, అశోక్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్ ఇతర అధికారులు కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

