పిల్లలతో కలిసి గాంధీ సినిమాను వీక్షించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్‌లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. పిల్లలతో కలిసి కొద్దిసేపు గాంధీ సినిమాను చూశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప నేత గాంధీజీ అన్నారు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు.గాంధీజీ మార్గం మనందరికి అనుసరణీయమన్నారు.
ఆయన చూపిన దారిలోనే సీఎం కేసీఆర్ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారు. మన గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు చాలా గొప్పవన్నారు. మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పది.
అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

