12 కోట్ల పనిదినాలు కల్పించండి.. కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి
Minister Errabelli Dayaker Rao | తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి విజ్ణప్తి చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి విజ్ణప్తి చేశారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, మరమ్మత్తులు, కొత్త రోడ్ల పనుల పురోగతిపై, ఉపాధి హామీ పథకంలో కల్పించే పనిదినాలు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు – నిధులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, ఉపాధి, హామీ పథకం స్పెషల్ కమిషనర్ ప్రసాద్‌తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష చేశారు.
పంచాయతీరాజ్ కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతం చేసేందుకు ఎక్కువ మందిని పనిలో పెట్టుకోవాలన్నారు. సీఆర్ రోడ్ల మరమ్మత్తు పనులకు సంబంధించి టెండర్లు పిలవని జిల్లాల్లో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అదేవిధంగా మొదటిసారి టెండర్ కాల్ ఫర్ చేసిన చోట్ల స్పందన లేకపోతే వెంటనే రెండోసారి టెండర్లను పిలవాలన్నారు.
ఉపాధి, హామీ పథకం కింద ఈ సంవత్సరంలో 10.5 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, వీటిని 12 కోట్ల పనిదినాలకు పెంచాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి రావల్సిన నిధులు దాదాపు రూ. 800 కోట్లను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని, ముఖ్య కార్యదర్శి, అధికారులు ఢిల్లీకి వెళ్లి ఈ నిధుల విడుదల కోసం కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

